శ్రీకాళహస్తిలో ఘనంగా మేడే వేడుకలు

TPT: శ్రీకాళహస్తిలో మేడే వేడుకలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రామసేతు వంతెన వద్ద ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోటావినూత కార్మికులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో కార్మికులకు, కర్షకులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.