అనకాపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించిన డీఐజీ

AKP: విశాఖ రేంజ్ డీఐజీ గోపినాధ్ జెట్టి అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్‌ను మంగళవారం సందర్శించారు. మహిళా పోలీస్ స్టేషన్ ద్వారా మహిళా భద్రతా చర్యలను మరింత బలపర్చాలని సూచించారు. మహిళా చట్టాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ట్రాఫిక్ స్మార్ట్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు.