జైహింద్ హాస్పిటల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: నందిగామ పట్టణంలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన జైహింద్ హాస్పిటల్‌ను ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, హాస్పిటల్ యాజమాన్యంతో కలసి ప్రారంభించారు. ఈ మేరకు హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బందికి శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.