'యూరియా కోసం రైతుని ఇబ్బంది పెట్టవద్దు'

AKP: యూరియా కోసం రైతులను ఇబ్బంది పెట్టవద్దని జిల్లా వ్యవసాయాధికారి బీ.మోహన్ రావు అన్నారు. శుక్రవారం మాకవరపాలెంలో ప్రైవేటు డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ప్రైవేటు డీలర్లు యూరియాను విక్రయించాలని, ఒక వేళ ఎక్కువ ధరకు విక్రయిస్తే లైసెన్సు రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అప్పారావు పాల్గొన్నారు.