'డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడం ప్రధాన లక్ష్యం'

'డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడం ప్రధాన లక్ష్యం'

RR: హయత్‌నగర్ డివిజన్ మిదాని కాలనీలో నూతన భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీవాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడం ప్రధాన లక్ష్యమన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటామని పేర్కొన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.