ఒమన్‌తో కలిసి హర్మూజ్ పర్యవేక్షణ: ఇరాన్
హర్మూజ్ జలసంధి పర్యవేక్షణకు సంబంధించి ఒమన్‌తో కలిసి ఒక ప్రతిపాదనను రూపొందిస్తున్నట్లు ఇరాన్ దౌత్యవేత్త ఖాజమ్ ఘరీబాబాది వెల్లడించారు. ఈ ప్రతిపాదన చివరి దశలో ఉందని తెలిపారు. త్వరలోనే తాము ఒమన్‌తో చర్చలు జరుపుతామని తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.