సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
SRPT: సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కోదాడ షీ టీమ్ ఎస్సై మల్లేష్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని జయ స్కూల్‌లో సైబర్ నేరాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ ద్వారానే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. మొబైల్ వినియోగం పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.