విశాఖ రానున్న ప్రధాని మోదీ

విశాఖ రానున్న ప్రధాని మోదీ

విశాఖలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ రానున్నారు. ఏర్పాట్లపై బుధవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. యోగాలో సుమారు 2 లక్షల మంది పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం స్థలం పరిశీలించనున్నారు.