రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పసుపు జెండా నిలిచింది : ఎమ్మెల్యే
NTR: ఇబ్రహీంపట్నంలో టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొని, పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేకులు కట్ చేసి పంచుకున్నారు. 'జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం' అంటూ నినదించారు. తెలుగుజాతి ఔన్నత్యం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పసుపు జెండా నిలిచిందన్నారు.