అంతర్జాతీయ స్థాయి ఎయిర్ షోలో పెబ్బేరు యువకుడు

అంతర్జాతీయ స్థాయి ఎయిర్ షోలో పెబ్బేరు యువకుడు

WNP: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షోగా పేరుగాంచిన ‘వింగ్స్ ఇండియా-2026’ కార్యక్రమం హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టులో వైభవంగా జరుగుతోంది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ ఎయిర్ షోలో పెబ్బేరుకు చెందిన షోయాబ్ వ్యాఖ్యాతగా తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయి ఎయిర్ షోలో షోయాబ్‌కు అవకాశం రావడంపై స్థానికులు ఆనంద వ్యక్తం చేశారు.