పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్
PLD: చిలకలూరిపేట (మం) బొప్పూడి చెంచు కాలనీలో పేకాట ఆడుతున్న ఏడుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఎస్సై అనిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశారు. వారి దగ్గర నుంచి రూ. 31,500 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.