అక్రమంగా డీజిల్ తరలిస్తున్న ట్యాంకర్ పట్టివేత
కోనసీమ: యానాం నుంచి అక్రమంగా ట్యాంకర్ ద్వారా సుమారు 8 వేల లీటర్లు డీజిల్ తరలిస్తుండగా ఎదుర్లంక వద్ద ఐ. పోలవరం ఎస్సై రవీంద్రబాబు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట తరలిస్తుండగా ఎదుర్లంక గ్రామం వద్ద పట్టుకుని డీజిల్ ట్యాంకర్ సీజ్ చేసి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.