వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు
ATP: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడీ మాజీ AVSO సతీష్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో చనిపోతే, టీడీపీ నాయకులు దీనికి హత్య అని ప్రచారం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. అయితే అంతిమంగా న్యాయస్థానంలో మాకు న్యాయం చేసిందని చెప్పుకొచ్చారు.