పోలీస్ శాఖకు బ్రీత్ ఎనలైజర్స్ అందజేత
NZB: జాతీయ రహదారి 44పై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేయడానికి.. సేవ్ లైఫ్ ఫౌండేషన్ 10 బ్రీత్ ఎనలైజర్లను అందజేసిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బ్రీత్ ఎనలైజర్స్ అందజేశారు.