ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
కృష్ణా: గన్నవరం మండలం కేసరిపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిన్న అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.