ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్: ఎంపీడీవో
CTR: గుడిపాల మండలంలో ఇంటి పన్నుల వసూళ్లపై 2 రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శిరీష పేర్కొన్నారు. ఇప్పటికే మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ఇంటి పన్నులను దాదాపు వసూలు చేశామన్నారు. అలాగే, గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి మండలంలో 2 రోజులపాటు ఇంటి పన్నులను 100% శాతం వసూలు చేసి పంచాయితీ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.