నేడు JNTU లో 12వ స్నాతకోత్సవం
KKD: JNTU కాకినాడ 12వ స్నాతకోత్సవం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. బుధవారం వర్సిటీ VC ప్రొఫెసర్ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా దీనిని 'డిజిటల్ స్నాతకోత్సవం'గా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు డిజిటల్ విధానంలో పట్టాలు అందజేయనున్నారు.