ఖానాపూర్‌లో పాము కాటుతో ఒకరి మృతి

ఖానాపూర్‌లో పాము కాటుతో ఒకరి మృతి

NRML: పాముకాటుతో ఒకరు మృతి చెందిన ఘటన ఖానాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై గైక్వాడ్ వివరాల ప్రకారం.. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఏనుగుల రాజేశ్వర్ ఆదివారం అర్థరాత్రి తలుపు తీసి నీరు తాగుతుండగా ఫ్రిజ్ కింద ఉన్న నాగుపాము కుడికాలుపై కాటువేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో నిర్మల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మ‌ృతి చెందాడు.