పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
KKD: ఎమ్మెల్యే పంతం నానాజీ కరప మండలం అరట్లకట్టలో రూ.1.21 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం, జల జీవన్ మిషన్ కింద భారీ నీటి ట్యాంక్ ఏర్పాటుతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. అదనంగా నూతన కల్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.