స్టార్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు
పాకిస్తాన్ స్టార్ బౌలర్ నషీమ్ షా ఇంటి వద్ద కాల్పుల ఘటన కలకలం రేపింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని మయూర్ ప్రాంతంలో ఉన్న నషీమ్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇంటి గేట్లు, కిటికీలు, పార్క్ చేసిన కారు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.