బాలానగర్‌లో అనిరుధ్ రెడ్డి ప్రచారం
MBNR: బాలానగర్ మండలంలోని నందారం, గౌతాపూర్, మోతిఘనపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి, వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారానికి మద్దతు ఇచ్చారు.