రూ.70లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

SRD: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 70 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రజలకు వైద్యం మరింత చేరువవుతుందన్నారు.