గాగిల్లాపూర్‌లో వన మహోత్సవం

SDPT: బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో శనివారం వన మహోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న ఎల్లమ్మ ఆలయం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, హుస్నాబాద్ ఎక్సైజ్ ఎస్సై రూప ముఖ్య అతిథిగా హాజరై 500 మొక్కలను నాటించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కట్టుబడి ఉండలన్నారు.