డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా
SS: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారం, బహిరంగ మద్యపానం, అక్రమ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పలు ప్రధాన ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను రికార్డు చేశారు.