మృతిచెందిన రైతు కుటుంబానికి అండగా: మాజీ ఎమ్మెల్యే

సూర్యాపేట: మద్దిరాల మండలం చిన్ననేమిల గ్రామానికి చెందిన రావుల లింగయ్య ఇటీవల పాముకాటుతో మరణించడంతో బుధవారం ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.