మీసేవ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కమీషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక శోధన నగర్ ప్రాంతంలోని మీసేవ కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీ సేవ నిర్వహణ, కేంద్రం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు తదితర వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మీసేవ చుట్టూ పారిశుద్ధ్య పర్యవేక్షణ నిరంతరం చూడాలని అధికారులు ఆదేశించారు.