మిడుతూరు పోలీస్ స్టేషను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

మిడుతూరు పోలీస్ స్టేషను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ గురువారం మిడుతూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విని, వృద్ధులు, నిరుపేదలు, మహిళలు వంటి బలహీన వర్గాల కేసులను ప్రాధాన్యంగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ కేసుల స్థితిని విచారించి, వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు.