SRH vs DC: వర్షం కారణంగా నిలిచిన ఆట

వర్షం కారణంగా SRH, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పారు. SRH ఇన్నింగ్స్ ప్రారంభమయ్యేందుకు ఇంకా సమయం పట్టనుంది. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.