గుండెపోటు చికిత్సపై అవగాహన కార్యక్రమం

NLR: ఇందుకూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం నందు శుక్రవారం గుండెపోటు అత్యవసర చికిత్సపై డాక్టర్ సునీల్ స్థానికవైద్య సిబ్బందికి అవగాహన చేశారు. గుండెపోటుకు గురైతే గుండె సంబంధిత ప్రాథమికంగా పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి మొదటి గంటలోనే 45 వేల రూపాయలు కలిగిన టెనెక్ట్ ప్లస్ ఇంజక్షన్‌ను ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ విషయాలను వైద్య సిబ్బంది ప్రజలకు తెలియజేయాలన్నారు.