కాళీమాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

కాళీమాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

GNTR: దసరా ఉత్సవాలలో భాగంగా తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నిన్న రాత్రి పలు ఆలయాలను సందర్శించుకున్నారు. శివాజీ చౌక్‌లోని శ్రీ కాళీమాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మాజీ కౌన్సిలర్ రమేశ్, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.