ఆ సంస్థ వెనక ఎవరున్నారో చెప్పాలి: గుడివాడ

ఆ సంస్థ వెనక ఎవరున్నారో చెప్పాలి: గుడివాడ

AP: సత్వ రియల్ ఎస్టేట్ వెనుక ఎవరున్నారో కూటమి ప్రభుత్వం బయటపెట్టాలని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. 'సత్వ భూకేటాయింపులో 50శాతం రెసిడెన్షియల్ అవసరాల కోసం అనుమతిచ్చారు. 3 నెలల సమయం ఇచ్చినా సత్వ రియల్ ఎస్టేట్ సంస్థ రూ.40 కోట్లు చెల్లించలేదు. ఆ సంస్థ రూ.1500 కోట్ల పెట్టుబడులు పెడుతుందంటే ఎలా నమ్మాలి?' అని ప్రశ్నించారు.