సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ

సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ

BDK: ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందజేస్తోందని ఏడీఏ తాతారావు తెలిపారు. శనివారం పినపాక మండలం ఈ బయ్యారం రైతు వేదిక వద్ద దరఖాస్తు చేసుకున్న రైతులకు గడ్డి కట్టే మిషన్లు , కల్టివేటర్లు, రోటవేటర్లు, తైవాన్ స్ప్రేయర్లను పంపిణీ చేశారు, రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా పరికరాలను అందిస్తామన్నారు.