నేర నియంత్రణకు 15 సీసీ కెమెరాలు ఏర్పాటు
SKLM: పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంపోస్ట్ కాలనీలో స్థానిక ప్రజల సహకారంతో 15 సీసీటీవీ కెమెరాలను శ్రీకాకుళం రూరల్ సీఐ పైడిపు నాయుడు సోమవారం ఏర్పాటు చేయించారు. ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాలను అరికట్టడం, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెంచడం లక్ష్యంగా ఈ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.