శ్రావణంలో దిగజారిన అరటి గెలల ధరలు

కోనసీమ: శ్రావణమాసం ప్రారంభమైనా అరటి ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రావులపాలెం అరటి మార్కెట్‌లో కర్పూర అరటి గెల ధర రూ.200-రూ.250 మాత్రమే పలుకుతోందని మందపల్లికి చెందిన రైతు బాపయ్య ఆదివారం వాపోయారు. గెల పెంపకానికి రూ.350-రూ.400 ఖర్చవుతుందని, వేసవిలో మంచి ధర పలికినప్పటికీ ఇప్పుడు పూర్తిగా పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.