యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం: కలెక్టర్

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం: కలెక్టర్

ADB: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ యోగాసనాలు వేశారు. మారుతున్న జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు, శారీరక, మానసిక సమతుల్యత సాధించేందుకు యోగా అత్యుత్తమ సాధనమని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.