VIDEO: రైల్వే అండర్ పాస్ వద్ద అవస్థల ప్రయాణం

GDWL: మానవపాడు నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే అండర్ పాస్ వద్ద ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి అండర్ పాస్ వద్ద నీరు నిలిచింది. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే బైకర్లు ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణ సమయంలో వర్షం నీరు బయటకు వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాటు చేయలేదని ప్రజలు అంటున్నారు. నీరు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.