LoC వెంబడి మరోసారి పాక్ కవ్వింపు చర్యలు

LoC వెంబడి మరోసారి పాక్ కవ్వింపు చర్యలు

నియంత్రణ రేఖ(LoC) వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. కుప్వారా, అఖ్నూర్ ప్రాంతాల్లో నిన్న రాత్రి పాక్ ఆర్మీ స్వల్ప ఆయుధాలతో కాల్పులకు తెగబడింది. ఈ దాడిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. గత కొన్ని రోజులుగా LoC వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న చర్యలకు ప్రతిస్పందనగా పాక్ ఈ కాల్పులకు తెగబడుతోంది.