VIDEO: త్రాగునీటి రగడ... అధికారులను నిలదీసిన స్థానికులు
KKD: సామర్లకోట మండలం వెంకటకృష్ణరాయపురంలో త్రాగునీటి పరిస్థితిపై రగడ ఏర్పడింది. గత 4 నెలలుగా మంచినీటి సరఫరాకు దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని సత్యవారం పేటకు చెందిన ప్రజలు పంచాయతీ వద్ద అధికారులను నిలదీశారు. అరకొరగా వచ్చె నీళ్లు కూడా బురద మయంగా ఉన్నాయని తెలిపారు. ఎంపీడీవో హిమామహేశ్వరి, ప్రత్యేక అధికారి నారాయణ, మంచినీటి సమస్యలపై ప్రజలతో మాట్లాడారు.