అమరచింతలో ఎంపీ డీకే అరుణ పర్యటన
WNP: పాలమూరు ఎంపీ డీకే అరుణ శనివారం ఉదయం 11 గంటలకు అమరచింత మున్సిపాలిటీలో పర్యటించనున్నారు. పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో రూ.56 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు భూమి పూజ చేస్తారు. ఈ నిర్మాణం ఎసైంటియా అడ్వాన్స్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు హాజరుకావాలని పట్టణ అధ్యక్షురాలు మంగ లావణ్య కోరారు.