ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఆరేపల్లిలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైకును లారీ ఢీకొనడంతో దంపతులు అక్కడిక్కడే మృతి చెందగా, 2 సంవత్సరాల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కామారెడ్డికి చెందిన వసీం, ఐఫాగా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.