జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: కొమరోలు మండలంలోని తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏ.ఈ శ్రీనివాసులు తెలిపారు. మరమ్మతులు, కొత్త లైన్ల నిర్మాణం కారణంగా తాటిచెర్ల మోటు, గోవిందపల్లి గ్రామాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.