ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని వినతి

CTR: నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని NHRC జిల్లా అధ్యక్షులు ధనంజయ నాయుడు కోరారు. ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణను గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. రోడ్డుకు ఇరువైపులా తోపుడు బండ్లు, కూరగాయల విక్రయించే వాహనాలు రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తోందన్నారు. ఆక్రమణల తొలగింపునకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.