బీజేపీ కిసాన్ మోర్చా సమావేశం

BHNG: బీజేపీ కిసాన్ మోర్చా ముఖ్యకార్యకర్తల సమావేశం బీజేపీ యాదాద్రి జిల్లా కార్యాలయంలో శనివారం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ హజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.