VIDEO: 'పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 20 నెలల్లో పూర్తి చేస్తాం'

VIDEO: 'పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 20 నెలల్లో పూర్తి చేస్తాం'

MBNR: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 20 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లా పెండింగు ప్రాజెక్టులపై జిల్లా ప్రజా ప్రతినిధులతో మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల పనులను 2027 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.