నందిగామలో ఈ నెల 23న మెగా జాబ్ మేళా

NTR: నందిగామ KVR కాలేజీలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23న మెగా జాబ్ మేళా నిర్వహించనునట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. మంగళవారం దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆమె కార్యాలయంలో ఆవిష్కరించారు. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకునేలా వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నట్లు వెల్లడించారు.