పీఎం సూర్య ఘర్ పథకంతో విద్యుత్ ఆదా: ఎమ్మెల్యే

ప్రకాశం: సోలార్ పవర్ ద్వారా విద్యుత్ ఆదా అవుతుందని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం కనిగిరి టీడీపీ కార్యాలయంలో PM సూర్య ఘర్ రూఫ్ టాప్ సోలార్ స్కీం పోస్టర్‌ను ఆవిష్కరించారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్‌తో అధిక కరెంటు బిల్లుల నుండి వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందన్నారు.