విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

SDPT: విద్యుత్ షాక్‌తో గ్రామ పంచాయతీ కార్మికుడు మృతి చెందిన ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది.  చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఏర్పాట్ల పనులు చేస్తుండగా పైపు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై మోహిన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.