CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
ATP: ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు, కనగానపల్లి మండలాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత మొత్తం రూ.11.40 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ఈ సాయం ఎంతో ఊరటనిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.