కేశవాపూర్‌లో యూరియా కొరతపై రైతుల ఆందోళన

MLG: వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామంలో గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద యూరియా కొరతపై రైతులు ఆందోళన చేపట్టారు. PACS కేంద్రానికి కేటాయించిన యూరియా అవసరాలకు సరిపోవడం లేదని, సకాలంలో యూరియా అందించాలని రైతులు గురువారం ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది దిగుబడులు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.