ప్రభుత్వ కార్యాలయంలో పాము కలకలం

ప్రకాశం: మార్కాపురంలోని ప్రభుత్వ కార్యాలయంలో పాము కలకలం రేపింది. సోమవారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయ ప్రాంగణంలో పాము కనిపించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనంతరం స్నేక్ క్యాచర్కు సమాచారం అందించడంతో పామును పట్టుకొని అడవి ప్రాంతంలో వదిలేశారు. అక్కడి యజమానులు మాట్లాడుతూ.. నిరంతరం ఈ ప్రాంతంలో విష సర్పాలు కనిపిస్తుంటాయని తెలిపారు.